Heart Attack | గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి.. జమ్మికుంటలో విషాదం
Heart Attack | కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Heart Attack | కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి కన్నుమూసింది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతులకు ఉక్కులు (5) అనే కూతురు ఉంది. మంగళవారం ఉదయం నిద్రలేచిన బాలిక కాసేపు ఆడుకున్న తర్వాత కళ్లు తిరుగుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో బాలికను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన బాలికను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారి మృతి చెందింది. కాగా, చిన్నారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని వైద్యులు తెలిపారు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణవార్త వినగానే ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని తెలియడంతో జమ్మికుంటలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

