చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా(Cyclonic Storm) మారింది. అది వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఆ సైక్లోన్ చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. గురువారం ఉదయం వరకు పుదుచ్చరి, నెల్లూరు మధ్య ఆ తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై , నెల్లూరు తీరంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో అతి నుంచి అతిభారీ వర్షాలు కూడా కురవనున్నట్లు వెదర్ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో.. 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
The depression over southwest Bay of Bengal moved west-northwestwards with a speed of 12 kmph during past 6 hours and lay centered at 5:30 AM today over the same region near latitude 12.1° N and longitude 83.4°E, about 360 km east-southeast of Chennai (Tamil Nadu), 390 km east of… pic.twitter.com/iSCdQQc6GX
— ANI (@ANI) October 16, 2024