హైదరాబాద్ : అధికార పార్టీ అండ చూసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు(Congress leader) రెచ్చి పోతున్నారు. తాజాగా జహీరాబాద్(Zaeerabad) పార్లమెంట్ నియోజకవర్గంలో (Parliament elections) ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్(,Nagesh Shetkar) దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఓటరును కాలితో తన్ని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే ఇంతా జరుగుతున్న పట్టించుకోకుండా అధికార పార్టీకి వత్తసు పలుకుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నగేష్‌పై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
ఓటరుపై దాడి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటరుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ దాడి. pic.twitter.com/FN8VAPMo35
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024