Mallu Ravi | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఫిర్యాదు వస్తే ఈ అంశంపై చర్చిస్తానని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ హరికృష్ణకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ విషయంపై నర్సారెడ్డిని వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులపై వివరణ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పూజల హరికృష్ణపై ఫిర్యాదు వస్తే వివరణ అడిగామని చెప్పుకొచ్చారు. వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై కూడా నివేదిక ఇచ్చామని చెప్పారు. వారిపై చర్యలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
పూజల హరికృష్ణ, నర్సారెడ్డికి షోకాజ్ నోటీసులు: మల్లు రవి
వారం రోజుల్లో ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొనడం జరిగింది
షోకాజ్ నోటీసులపై వివరణ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం
– ఎంపీ మల్లు రవి pic.twitter.com/Gs0K3caXww
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025