కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 28: కాంగ్రెస్ అధిష్ఠాన నేతలు కోట్ల రూపాయలు చేతులు మార్చుకుని పరాయి వ్యక్తికి టికె ట్ కేటాయించారని కూకట్పల్లి సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు ఆరోపించారు. నియోజకవర్గంలో ఏండ్ల తరబడి పార్టీ జెండా మోస్తున్నవారికి కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రేవంత్ మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు కష్టపడి పనిచేసి గెలిపించామని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తిలోకాలిచ్చారని, కోట్లాది రూపాయలు చేతులు మార్చుకుని పరాయి పార్టీనుంచి వచ్చిన స్థానికేతరుడికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. నమ్ముకున్న పార్టీలో గుర్తింపు లేదని మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.