చొప్పదండి, ఫిబ్రవరి 5 : ‘సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..గ్రామంలో సమస్యలు ప్రస్తావిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తీసుకొచ్చిన్రు’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గడుగు రాజేశం తన ఆవేదన వెల్లగక్కాడు. గుమ్లాపూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మందుస్తుగా అరెస్టు చేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాజేశంను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా, తన ఆవేదనను బీఆర్ఎస్ నాయకులతో పంచుకున్నాడు. కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేస్తున్న తనను అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం బీఆర్ఎస్ చొప్పదండి పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరాడు. సొంత పార్టీ వాళ్లే తనను అరెస్టు చేయించడంతో కాంగ్రెస్‌ను వీడినట్లు రాజేశం ప్రకటించాడు.