Indiramma Indlu | నల్లబెల్లి, డిసెంబర్ 18: ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు డబ్బులు వసూలు చేసిన ఘటన వరంగల్ జిల్లా లెంకాలపల్లిలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు ఓ ఇద్దరి వద్ద రూ.5 వేల చొప్పున వసూలు చేశాడు.
దీంతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు యత్నిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ఆ చోటా లీడర్ తాను తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరికి డబ్బులు తిరిగి ఇవ్వగా, మరొకరికి డబ్బులు వాపస్ ఇస్తున్న క్రమంలో ఆ చోటా లీడర్‌పై చెప్పుతో దాడి చేశాడు.