సుబేదారి, జూన్ 10: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో విద్యుత్తు విజిలెన్స్ అధికారిపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు ఆకుతోట సమ్మిరెడ్డి ఇంట్లో విద్యుత్తు చౌ ర్యం జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఏఈ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ కోసం మంగళవారం అతని ఇంటికి వచ్చారు.
కుటుంబ సభ్యుల సమాచారంతో సమ్మిరెడ్డి వెంటనే ఇంటికి వచ్చి విజిలెన్స్ ఏఈ పవన్‌కుమార్‌పై దాడికి దిగాడు. దీంతో ఏఈ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సమ్మిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.