Phone Tapping | తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఫోన్ ట్యాపింగ్ కలవరం మొదలైంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఫోన్ చేయాలంటేనే భయపడిపోతు వణికిపోతున్నారు. దీనికితోడు వెంట న్నారు. కాల్ ఎత్తాలన్నా గజగజా గన్ మెన్లను తీసుకెళ్తే ఒక ఇబ్బంది, తీసుకెళ్లకపోతే మరో ఇబ్బంది! వెరసి కక్కలేక, మింగలేక నడిమిట్ల నలిగిపోతున్నారు.
తీవ్ర అభద్రతలో ఉన్న ఓ ముఖ్యనేత.. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తుండటమే అందుకు కారణం. ఇటీవల ఇద్దరు మంత్రుల సంభాషణను విన్న ఆయన.. మరునాడే తన సన్నిహితుడిని ఆ మంత్రి దగ్గరికి పంపారట. తమ సంభాషణ అంతా ఆయన చెప్తుంటే వారు అవాక్కయిపోయారట!
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తెలం గాణలో మంత్రుల సంభాషణలపై ‘ట్యాపింగ్ నీడలు’ అలుముకున్నాయి. ముఖ్యనేత కనుసన్నల్లో క్యాబి నెట్ మంత్రులపై గూఢచర్యం కొనసాగుతున్నది. వెరసి.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఆఖరికి కార్పొరేషన్ల చైర్మన్లు సైతం.. తీవ్రమైన
అభద్రతాభావంతో ఉన్నారు. తాము ఫోన్లలో మాట్లాడేది ‘ముఖ్యనేత’ వింటున్నారని వారు సైతం బలంగా ఫిక్సయి పోయారు. ఇదే అంశా న్ని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘సౌత్ ఫస్ట్’ సైతం మంత్రులు, ఇతర ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నా యని సంచలన కథనం రాసింది. సౌత్‌ఫస్ట్ కథనం ప్రకారం ఒక సీనియర్ మంత్రి, తన బంగ్లాలోని బెడ్ రూంలో విశ్రాంతి తీసు కుంటూ, మరో మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణ దాదాపు ఒక గంటకు పైగా సాగింది. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులు కావడంతో.. తమ ఆవేదనను ఒక రితో ఒకరు పంచుకున్నారు. అయితే, వారు
ఊహించని విధంగా, ఈ సంభాషణ దాదాపు పూర్తిగా ముఖ్యనేత చెవులకు చేరింది.
ఏమైనా సమస్యలుంటే నాకు చెప్పు
ముఖ్యనేత తనకు సన్నిహితుడైన మరో మంత్రి (కుడిభుజం)ని, ఈ సంభాషణలో పాల్గొన్న ఓ మంత్రితో మాట్లాడేందుకు పంపించారు. ఆ తర్వాత, ఆ మంత్రి, కుడి భుజం అనుకున్న మంత్రితో కలిసి కలిసి ముఖ్యనేత నివాసానికి వెళ్లారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వారిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలోని చాలా భాగా లను గుర్తు చేస్తూ ఆ మంత్రిని ఆశ్చర్యపరిచారు. “నువ్వు ఆయనతో (మరో మంత్రి) ఎందుకు చేతులు కలిపావు? నీకు ఏమైనా సమస్యలుంటే నాతో చెప్పు, నేను పరిష్కరి స్తాను” అని ముఖ్యనేత అన్నట్టు సమాచారం. ఈ సంభాషణ గురించి మీకెలా తెలిసిందని మంత్రి ప్రశ్నించగా, ఆయన చాలా స్పష్టంగా ఇలా సమాధానమిచ్చారట. “మీరు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తు న్నారు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై నిఘా ఉంచడం సహజం” అని ముఖ్యనేత సమాధానం ఇచ్చినట్టు సౌత్‌ఫస్ట్ తన కథనంలో తెలిపింది.
మంత్రులే కుట్ర చేస్తున్నారని హైకమాండ్‌కు చెప్తా
‘సంభాషణలో పాల్గొన్న మరో మంత్రిని ముఖ్యనేత ఎప్పుడూ బెదిరిస్తున్నట్టు సదరు మంత్రి చెప్పారట. అయితే ఆ రోజు మాట్లాడు కున్న ఆ ఇద్దరు మంత్రులు రెడ్డీలేనట. ‘ముఖ్య నేతను ఎంతకాలం సమర్థించాలి? ఎందుకు సమర్థించాలి?’ అనే విషయంపై చర్చించా రట. “ముఖ్యనేతకు పార్టీపై ఆసక్తి కంటే.. తన సొంత ఆసక్తిపైన, తన వాళ్లను కాపాడుకోవ డంపైనా దృష్టి పెడుతున్నారు. రోజువారీ పరి పాలనలో మంత్రులను కలుపుకుపోవడం లేదు” అని వారిద్దరూ సంభాషించుకున్నా రట. అయితే, ఇదే విషయం తక్షణం ముఖ్య నేత దృష్టికి చేరడంపై ఆ మంత్రి అవాక్కయ్యా రట. ఇదే అంశం ముఖ్యనేతతో మాట్లాడిన
తరువాత.. ‘నువ్ నా మాట వినకపోతే.. ఈ విషయాన్ని అక్కడితో ఆపను. పార్టీ హైకమాం డ్కు నేనే స్వయంగా ఫిర్యాదు చేస్తా. మంత్రులు నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నా రని చెప్తా. ఆ సంభాషణ ట్రాన్సక్రిప్ట్ను రుజు వుగా సమర్పిస్తా’ అంటూ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారట. కాగా, ఇప్పటికే తనపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో వారి దగ్గర మార్కులు కొట్టేసేందుకు సదరు ఆడియో క్లిప్‌లను ముఖ్యనేత అధిష్టానానికి పంపారని విశ్వసనీయ సమాచారం.
ఫోన్లు మార్చేసిన ఆ ఇద్దరు మంత్రులు
సాక్షాత్తూ ముఖ్యనేత తమ ఫోన్ సంభాష ణలు విని సున్నితంగా వార్నింగ్ ఇచ్చి, దారికితెచ్చుకునే ప్రయత్నాన్ని తనతో ఫోన్లో మాట్లాడిన మంత్రికి వివరించారట సదరు మంత్రి. ఈ హఠాత్ పరిణామాలతో సంబం ధిత మంత్రులిద్దరూ తమ ఫోన్లు మార్చేశా రట. ఒకరు ఫోన్ వాడకాన్ని మానేయగా, మరొక మంత్రి ఎవరినైనా సంప్రదించాలంటే గన్మోన్, లేదా వ్యక్తిగత కార్యదర్శిని సంప్రదిం చాల్సిన పరిస్థితి నెలకొన్నదట. మరో మంత్రి, కీలక నేత ఈ ఫోన్హ్యాపింగ్ సంభాషణలో పాల్గొనకపోయినా తనపై నిత్యం నిఘా ఉందని తెలుసుకున్నారట. హైదరాబాద్ విమానాశ్రయంలో తాను ఢిల్లీ, ఇతర ప్రాంతా లకు వెళ్తున్నప్పుడు పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు తనను ఫాలో అవుతున్న విష యాలను తాను గమనిస్తున్నట్టు చెప్పారు. మొత్తం మీద అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే ప్రతిరోజూ ఆందోళనకరమైన వాతా వరణంలో బతుకుతున్నారట. ఈ వ్యవహారం ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తున్నాయని సదరు సీనియర్ లీడర్లు చెప్పు కుంటున్నారు. ఇక మంత్రులతో పాటు ఎమ్మె ల్యేలు, విప్లపైనా నిఘా ఉందనే సమాచా రంతో అంతా ఎక్కడికక్కడే జాగ్రత్త పడుతు న్నట్టు తెలిసింది. కేటీఆర్ ఇటీవల ఖమ్మం సభలో మాట్లాడుతూ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయిస్తున్నప్పుడు తమవి చేయిం చడం పెద్ద పనికాదని ఎమ్మెల్యేలు భయపడు తున్నారట. ఈ లెక్కన కేటీఆర్ చెప్పింది నిజ మేనని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చర్చిం చుకుంటున్నారు.
గన్‌మెన్ గూఢచారులు
మంత్రులు, ఎమ్మెల్యేల అధికారిక, అంతర్గత విషయాలను తెలుసుకునేందుకు గన్మెన్లను గూఢచారులుగా ఎంచుకున్నట్టు తెలిసింది. కొందరు గన్ మెన్లు ఉదయం డ్యూటీ ఎక్కిన దగ్గరి నుంచి ఆయా నేతలు ఎటువైపు వెళ్తున్నారు? ఎవ రెవరితో మాట్లాడుతున్నారు? వంటివి విష యాలను నేరుగా ఇంటెలిజెన్స్ ఆఫీస్‌కు పంపుతున్నట్టు తెలిసింది. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే వరకూ ఇలా వివరాలు తెలుపుతున్నట్టు విశ్వసనీయవ ర్గాలు తెలిపాయి. ఒకవేళ ఎవరైనా గన్మో న్లు లేకుండా వెళ్లినా, గన్ మెన్లను డ్యూటీకి రావొద్దని చెప్పినా ఆ విషయాన్ని వెంటనే ఇంటెలిజెన్స్ విభాగానికి మెసేజ్
రూపంలో చేరవేయాల్సి వస్తున్నదని ఓ గన్ మెన్ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. ‘ఒక వేళ గన్‌మెన్ లేకుండా వెళ్తే ఆ రోజు నిఘా ఎక్కువగా ఉంటుంది’ అని చెప్పారు. ఇప్పుడు మెసేజ్‌లపై నమ్మకం లేక జీపీఎస్ సెల్ఫీ విధానం ప్రవేశపెట్టారని వాపోతు న్నారు. పై అధికారులు ఆదేశిస్తుండటంతో జీపీఎస్ లొకేషన్ కలిగిన సెల్ఫీని పంపుతు న్నట్టు సమాచారం. తద్వారా తేదీ, సమయం, ప్రాంతం వంటి వివరాలన్నీ షేర్ అవుతాయి. ఆ ఫొటోల ఆధారంగా నేతల కదలికలను ట్రాక్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.