హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమకు ఓ టమి తప్పదన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారం రోజుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగంపై బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌తోపాటు కాంగ్రెస్ నేతల అక్రమాలను నిరోధించేందుకు, జూబ్లీహిల్స్ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం ఈసీకి విజ్ఞప్తి చేశారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదరరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేం ద్ర బలగాలను రంగంలోకి దింపాలని, తద్వా రా ఓటర్లు స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని ఈసీని కోరినట్టు తెలిపారు. ఎ లాంటి వారెంట్లు లేకుండా గురువారం కొందరు పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతల ఇండ్లకు వెళ్లి సోదాలు చేయడం, ఇతర నాయకులపై దాడి చేయడంపై ఆధారాలతో ఈసీకి వివరించినట్టు తెలిపారు.బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఈసీ సానుకూలంగా స్పందించిందని సురేశ్‌రెడ్డి వెల్లడించారు.