కాంగ్రెస్‌ది హిందూ వ్యతిరేక ధోరణి
అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.
- ప్రాణ ప్రతిష్ఠను బహిషరించడాన్ని ప్రజలు క్షమించరు
- పూజిత అక్షింతలు అందజేస్తున్న వారి అరెస్టు దుర్మార్గం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 500 ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం కల సాకారమైందని చెప్పారు. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, కవులు, కళాకారులు, సాధుసంతులను, సామాజిక సంస్థలను, సీఎంలను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నదని చెప్పారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్‌ను శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించిందని తెలిపారు. అభద్రతాభావంతో, కుహనా లౌకికవాదంతో, సూడో సెక్యులరిస్టులుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ ఆహ్వానాన్ని తిరస్కరించారని మండిపడ్డారు. ఓటుబ్యాంకు రాజకీయ కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏండ్లుగా శ్రీరాముడి ఉనికినే దాచిపెట్టిందన్నారు. అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను భక్తిభావనతో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్‌లోని సింధూ కాలనీలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- anti-Hindu
- Ayodhya
- Congress
- Hindu
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

