కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు
‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పా ల్పడినా.. ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఓటరు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు వంటిది’ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దేవీప్రసాద్ స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- పలుచోట్ల అధికార పార్టీ అక్రమాలు..అయినా బీఆర్ఎస్కు మంచి ఫలితాలు
- కాంగ్రెస్ అక్రమాలు, అరాచకాలపై ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదు
- ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి
- బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పా ల్పడినా.. ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఓటరు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు వంటిది’ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దేవీప్రసాద్ స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పం చాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తొడపాశం పెట్టారని గుర్తుచేశారు. దానిని తట్టుకోలేకే ఈ ఎన్నికల్లో అధికారిక సంస్థలను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఆగడాలకు ప్రజలు జంకకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలువడం కోసం కాంగ్రెస్ నాయకులు చేసిన అక్రమాల పై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు భారీ కాన్వాయ్‌లో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు.
అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్లాం
మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతోనే బీఆర్ఎస్ ముందుకెళ్లిందని దేవీప్రసాద్ తెలిపారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధినే ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. జగ్గారెడ్డి పోలీసులపై వాడిన భాష అభ్యంతరకరమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ ఎమ్మెల్యే ఓటర్లను భయపెట్టారని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత రాఘవేంద్రయాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

