హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తె లంగాణ): విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక 7.3 శాతం మాత్రమే ఇచ్చిందని, ఇది ఏ మాత్రమూ సరికాద ని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ ఆక్షేపించింది.
తమిళనాడులో 13.4శాతం, క ర్ణాటకలో 12.9శాతం, కేరళలో 14.8 శాతం, ఏపీలో 12.6శాతం, దేశవ్యాప్తం గా సగటున 15శాతం నిధులిస్తే తెలంగాణలో కేవలం 7.3 శాతం నిధులిచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో మార్పులపై గురువారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ ఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పీఎల్ వి శ్వేశ్వర్రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఆశాస్త్రీయమైన ఉపాధ్యాయుల సర్దుబాటు జీవో-25ను ఉపసంహరించుకోవాలని, 1-3 తరగతులను అంగన్వాడీలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని, ప్రాథమిక పాఠశాలల్లోనే పూ ర్వ ప్రాథమిక విద్య బోధించాలని సమావేశంలో నిర్ణయించారు.