హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 27 ఏండ్ల కాల పరిమితికి రూ.1000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితికి మరో రూ.500 కోట్లను 7.07 శాతం వార్షిక వడ్డీతో రుణ సమీకరణ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నుంచి మంగళవారం వరకు ఒక్క ఆర్బీఐ నుంచే అక్షరాల రూ.71,327 కోట్లు అప్పుగా తీసుకున్నది. 2024-25వ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా రూ.56,209 కోట్లు సేకరించింది.