పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 25: జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయినితొర్రూ రు జే గ్రామంలో బుధవారం రెవెన్యూ, పోలీ స్ అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల నుంచి లబ్ధిదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పసులాది ఆంజమ్మ, జోగు ఇందిర, గడ్డం భూలక్ష్మి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం 20 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూ రు చేసింది. పూర్తయిన వాటికి రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల ను ఎంపిక చేశారు.
పట్టా సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వలేదు. అధికారులకు సమాచారమివ్వకుండానే 10 నెలల క్రితం గృహప్రవేశాలు చేశారు. బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సైలు సాయిప్రసన్నకుమార్, సృజన్‌కుమార్, యా కూబ్హుస్సేన్ ఆధ్వర్యంలో గృహాలను ఖాళీ చేయించారు. దీంతో కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే అధికారులు ఇండ్లు ఖాళీ చే యించారని లబ్ధిదారులు మండిపడ్డారు. అక్రమంగా డబుల్ బెడ్రూం ఇండ్లలోకి ప్రవేశిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో డీఎస్ వెంకన్న హె చ్చరించారు. త్వరలో గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల కుట్రలతోనే మా ఇండ్లను ఖాళీ చేయించిన్రు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేదల కోసం కట్టించి ఇచ్చిన ఇండ్లు ఇవి. గ్రామసభలో మమ్మల్ని ఎంపిక చేసిన్రు. అధికారులు కావాలనే మమ్మల్ని ఖాళీ చేయించిన్రు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, హనుమండ్ల ఝాన్సీరెడ్డిలకు మా పేదల ఉసురుతగులుతది.
-పసులాది అంజమ్మ, లబ్ధిదారురాలు