హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా మూడుసార్లు కోడిగుడ్లు సరఫ రా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలలు తిరగకముందే వెనక్కి తగ్గింది. వచ్చే నెల నుంచి రెండుసార్లు మా త్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అంగన్వాడీ సెంటర్ల కు సరఫరా చేసే సరుకుల నాణ్యతపై మంత్రి సీతక్క మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమావేశానికి అధికారులతో పాటు కాంట్రాక్టర్లు కూడా హాజరయ్యారు. గుత్తేదారులు మాట్లాడుతూ ప్రతినెలా మూడుసార్లు గుడ్లు సరఫరా చేయడం ఇబ్బందిగా ఉందని, రెండుసార్లు మాత్ర మే చేస్తామని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి మంత్రి సీతక్క సమ్మతించారు.
వాస్తవానికి టెండర్ నిబంధనల ప్రకారం ప్రతినెలా మూడుసార్లు అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్లను సరఫరా చే యాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు నాణ్యమైన కోడిగుడ్లు అందించేందుకు ప్రభు త్వం ఈ నిబంధన పెట్టింది. కాంట్రాక్టర్ల కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో మారెట్ ధర కంటే ఎకువగానే చెల్లించేందుకు అంగీకరించారు. కానీ రెండు నెలలు తిరగకముందే మంత్రి యూటర్న్ తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ఫైల్‌పై సం తకం చేసిన మంత్రే వెనకి తగ్గడం ఎందు కో అంతుచికడంలేదు. గుత్తేదారులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
సీతక నిర్ణయంతో గురుకులాలు, పాఠశాలలకు ఏ విధంగా సరఫరా చేస్తార నే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారికి ఇదే నిర్ణయం వర్తిస్తుందా? పాత పద్ధతిలోనే సరఫరా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. టెండర్ నిబంధనలను ఉల్లంఘించేలా మంత్రి ముందుకెళ్లడం సరికాదని అధికారులు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వం ఇరకాటంలో పడే ప్రమాదమున్నదని చెబుతున్నారు.