హైదరాబాద్: ఎస్ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్ చేశారు కానీ నిర్మాణంలో ఉన్నవాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశాని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమేనా అని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతల మీద ఉన్న శ్రద్ద నిర్మాణాల మీద లేదా అని నిలదీశారు. అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.
‘‘నాడు వాయువేగంతో ఎస్ఆర్డీపీ పథకం కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జీలు
16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్న పనులు
ఫలక్ నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదు
ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చంచల్ గూడా జైలుకు పంపే శ్రద్ద దాని ముందున్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడంపై లేదు
శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లెవెల్ వంతెనది అదే దుస్థితి
శాస్త్రిపురం ఆర్వోబీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి
పూర్తయిన వాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగులు చేశారు
నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశారు
కాంగ్రెస్ అంటే కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమేనా ?
హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతల మీద ఉన్న శ్రద్ద నిర్మాణాల మీద లేదా!
అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం, బుల్డోజర్ లను ఉసిగొల్పడం కాదు!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.