Congress | అభద్రతా భావంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. వరంగల్లో రైతు సదస్సుకు ఏర్పాటు చేసిన జెండాలు, తోరణాలు తొలగింపు
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ నెల 6వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సు రోజే కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది.
వరంగల్ వేదికగా జరగనున్న రైతు సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలైందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని మండిపడింది. గులాబీ జెండా ఎగిరితే.. కాంగ్రెస్ సర్కార్కు అంత వణుకెందుకు? అని ప్రశ్నించింది.
కేటీఆర్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన తోరణాలను తొలగించడం మీ పిరికితనానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. తోరణాలు తొలగించినంత మాత్రాన రైతుల గుండెల్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్ను తొలగించలేరని స్పష్టం చేసింది. ఖబర్దార్ కాంగ్రెస్.. వరంగల్ గడ్డ నుంచే మీ పతనం మొదలైందని హెచ్చరించారు.
అభద్రతా భావంలో కాంగ్రెస్ ప్రభుత్వం
వరంగల్ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ జెండాలు, తోరణాలు తొలగిస్తున్న GWMC సిబ్బంది
ఇప్పటికే మే 6న బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సు రోజే కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం https://t.co/LyJQkOedgg pic.twitter.com/Cgr1PDWW87
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- GWMC
- Hanumakonda
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

