హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): ఈ-టెండర్ ద్వారా దుస్తులు, కార్పెట్లు తదితర వస్ర్తాల కొనుగోలుకు సంబంధించి హై కోర్టు తీర్పును జీర్ణించుకోలేని సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. తెరవెనుక కొత్త ఎత్తుగడలను వేస్తున్నది. టెస్కోలనే ముందుపెట్టి పంతం నెగ్గించుకునేందుకు అడ్డదారులు తొ క్కుతున్నది. చేనేత కార్మికుల పొట్ట కొట్టేందుకు సిద్ధమవుతున్నది.
విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించి దుస్తులను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని గతంలో వైఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. దాదాపు 24వేల మంది కార్మికుల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకొని అదే విధానాన్ని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఆ ఆనవాయితీని కొనసాగించింది. బతుకమ్మ చీరలు, ఇతరత్రా ఆర్డర్లను సైతం అదనంగా అందించి మరింత ఉ పాధి కల్పించింది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఆ విధానాలకు స్వస్తి పలికింది. టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని నిరుడు మార్చి లో జీవో-1ను మరోసారి జారీ చేసింది. కానీ తాము జారీ చేసిన జీవోనే సర్కార్ తుంగలో తొక్కింది. జీవోకు విరుద్ధంగా ఈ-టెండర్ వి ధానానికి తెరలేపింది. రూ.250కోట్ల యూనిఫామ్‌ల ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా టెస్కోకు యూనిఫామ్‌ల ఆర్డర్లు దూరమైనట్టే. బడా కంపెనీలకే టెండర్ దక్కే అవకాశమే ఎక్కువ. అందుకు అనుగుణంగానే సర్కార్ నిబంధనలు రూపొందించడం గమనార్హం. వెరసి రాష్ట్రంలోని 17,069 హ్యాండ్‌లూమ్‌లు, 40వేల కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ-టెండర్ విధానాన్ని రద్దు చేయాలని పలు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న కోర్టు సర్కార్ చర్యలను తప్పుబట్టింది. టెస్కోల ద్వారానే వస్ర్తాలు కొనుగోలు చేయాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలోనూ ఈ-టెండర్ పై వెనక్కి తగ్గేందుకు సర్కార్ ససేమిరా అంటున్నది. తీర్పును అడ్డు పెట్టుకొని టెండర్ విధానంలోనే ముందుకు వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నది. వాస్తవంగా వస్ర్తాలను సరఫరా చేయలేమని టీఎస్సీవో నుంచి ధ్రువీకరణ పత్రం జారీచేస్తేనే ఇతర ఏజెన్సీల నుంచి వస్ర్తాల కొనుగోలు చేపట్టవచ్చని హైకోర్టు వెల్లడించింది. ఇదే అదునుగా సర్కార్ పావులు క దుపుతున్నట్టు సమాచారం. టెస్కో నుంచి నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ తీసుకునేదిశగా కసరత్తు చేస్తున్నదని తెలుస్తున్నది. నాణ్యత ఉండబోదనే పేరుతో హైకోర్టు ఉత్తర్వుల నుంచి తప్పించుకొనే మార్గాలను అన్వేషిస్తున్నది. డిమాండ్‌కు తగినట్టు సరఫరా చేయలేరని, నాణ్యత కూడా ఉండబోదని కార్మికులను, చేనేత పరిశ్రమను అవమానించారు. టెండర్ విధానాన్నే అనుసరిస్తామని తేల్చిచెప్పారు. మొండిగానే ముందుకు పోయిన సర్కార్.. హైకోర్టు తీర్పును జీర్ణించుకోలేకపోతున్నది. మళ్లీ టెండర్ ద్వారానే ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నది. దీనిపై సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల పొట్ట కొట్టేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎంయూ ఈ-టెండర్ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేయడం చేనేత కుటుంబాల విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 17 వేలకు పైగా హ్యాండ్లూమ్స్ ఉండగా, వాటిపై ఆధారపడి 40వేల చేనేత కుటుంబాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు ప్రత్యేక జీవో ద్వారా ఈ-టెండర్ విధానం తెచ్చి చేనేత కార్మికుల పొట్ట కొట్టాలని చూసిందని మండిపడ్డారు. గురుకుల విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు అవసరమయ్యే బెడ్ షీట్లు, కార్పెట్లు, టవల్స్ అన్నీ టెస్కో ద్వారానే తీసుకోవాలనే హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వస్ర్తాల కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి, చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరారు. ఇందుకోసం అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టెస్కో ద్వారానే వస్ర్తాల ను సేకరించి చేనేత, మ రమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆ దేశాలిస్తూ హైకోర్టు తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నాం. చేనేత, మరమగ్గాల కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించడానికి జీవో 1ని ప్రభుత్వమే ఇచ్చింది. కానీ జీవోకు విరుద్ధంగా టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా టెండర్ల కు పోయింది. టెండర్ల విధానం రద్దు చేయాలని హైదరాబాద్‌లో మహాధర్నా చేశాం. ప్రభుత్వంపై నమ్మకం లేక చేనేత సొసైటీలు కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు తీర్పుతో కార్మికులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయాలి.
– మూషం రమేశ్, పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
హైకోర్టు తీర్పు హర్షనీ యం. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. చేనేత మరమగ్గాల కార్మికు ల నిరంతర ఉపాధిని క ల్పించేందుకు కేసీఆర్ సర్కార్ టెస్కో ద్వారా అన్ని ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ని రంతరం ఉపాధి కలిగింది. కాంగ్రెస్ సర్కార్ సైతం టెస్కో ద్వారానే ఆర్డర్లు ఇస్తామని చె ప్పి ఇచ్చిన జీవోకు వారే తూట్లు పొడిచి టెండర్లకు వెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులకు మేలు జరిగేలా చూడాలి.
– మంచె శ్రీనివాస్, వస్త్ర పరిశ్రమ యజమాని (సిరిసిల్ల)