హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ)/ హైదరాబాద్ సిటీబ్యూరో : తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించాల్సింది పో యి, అక్రమాలను ప్రశ్నించిన, అవినీతిపై గొంతెత్తిన వారిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉకుపాదం మోపుతున్నది. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టినా, కుంభకోణాలను వెలికితీసినా అక్రమ కేసులతో గొంతునొకడం నిత్యకృత్యమైంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను ఎదురోలేక, పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని సాగిస్తున్న ఈ దాష్టీకం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, పార్టీ అధికార ప్రతినిధి దళిత నేత మన్నె క్రిశాంక్‌ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసుల వల విసురుతున్నారు. ప్రతీ చిన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ, రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు క్రిశాంక్‌పై రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదయ్యాయి. 2024లో మొదలైన ఈ కేసుల దాడి 2025 సంవత్సరంలో పరాకాష్టకు చేరగా, 2026 నాటికి అది మరింత ఉధృతమైంది. ఒకే సంవత్సరంలో పదికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వేధింపులకు పాల్పడుతున్నదో వర్ధమాన దళిత నేత క్రిశాంక్‌పై పెట్టిన కేసుల సెక్షన్లు పరిశీలిస్తే అర్థమవుతుంది.
న్యాయం అడిగితే రిమాండా?
ఈ కేసుల పరంపరలో తాజా ఉదంతం మరింత దారుణంగా ఉన్నది. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని, బాధ్యుడైన రాజేంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి ఫిర్యాదు చేశారు. మహిళపై నిరాధార ఆరోపణలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలిపినందుకు క్రిశాంక్పైనే ఉల్టా కేసు బనాయించారు. అదే రాజేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు క్రిశాంక్‌తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో క్రిశాంక్‌ను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయనను సంగారెడ్డి జైలుకు తరలించారు. రాజకీయంగా ఎదురోలేక, ఇలాంటి పోలీసు కేసులతో భయపెట్టాలని చూడటం కాంగ్రెస్ మార్ రాజకీయాలకు నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు.
పక్కా ప్లాన్‌తోనే అరెస్ట్
పక్కా ప్లాతోనే క్రిశాంక్‌ను అరెస్ట్‌కు రంగం సిద్ధంచేశారు. మొదట కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి బాలానగర్ ఏసీపీ ఆఫీస్‌కు తరలించా రు. గురువారం రాత్రి వరకు ఇది కొనసాగింది. రాత్రి 11గంటల సమయంలో క్రిశాంక్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకుపోతున్నారనే సమాచారం లేకపోవడంతో బీఆర్ఎస్ లీగల్ బృందం, నాయకులు ఆరా తీశారు. వైద్య పరీక్షలకు తీసికెళ్తున్నారని గుర్తించి, అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో జడ్జి ఇంటి వద్దకు క్రిశాంక్‌ను తీసుకుపో యారు. అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు జడ్జి ముందు పోలీసులు రిమాండ్ రిపోర్టును ఉంచారు. అయితే ఫిర్యాదులో లేని 308 క్లాస్-5 సెక్షన్ పెట్టడం అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ కారణంగానే తిరిగి క్రిశాంక్‌ను తిరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా స్టేషన్లోనే రాత్రంతా క్రిశాంక్‌ను నిర్బంధించారు. సొంత పూచీకత్తుపై వదిలేసి, ఉదయం రమ్మని చెప్పే వీలున్నా.. పోలీసులు మాత్రం వేధించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు ఆయన అనుచరులు ఆరోపించారు.
క్రిశాంక్ లేవనెత్తిన అవినీతి అంశాల్లో కొన్ని ఇవే..
ఫిర్యాదులో లేని సెక్షన్లతో తప్పుదోవ
శుక్రవారం క్రిశాంక్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సెక్షన్ 308 క్లాస్-5 బీఎన్ఎస్ సెక్షన్ ఇక్కడ వర్తించందని ఆ సెక్షన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో మిగతా సెక్షన్లన్నీ ఏడేండ్ల లోపు ఉన్నవే కావడంతో నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. దీంతో పోలీసులు కొత్త డ్రామా చేశారు.. నిబంధనలు తుంగలో తొక్కారు. క్రిశాంక్‌పై 21 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మెమో దాఖలు చేశారు. ముందుగా తమ కౌన్సిల్ నోటీసులు ఇచ్చి పోలీసులు మెమో దాఖలు చేయాలి, కానీ అలా ఎలాగైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఇలా చేశారు. పోలీసులు పెట్టిన మెమోను బీఆర్ఎస్ లీగల్‌సెల్ బృందం గట్టిగా వ్యతిరేకించింది. వాదనలు విన్న న్యాయస్థానం క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురికి రిమాండ్ విధించింది. క్రిశాంక్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం న్యాయస్థానం ముందుకు రానున్నాయి. ఇదిలా ఉండగా 308 క్లాస్‌ను న్యాయస్థానం తొలగించిందంటే పోలీసుల దర్యాప్తులో లోపాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని బీఆర్ఎస్ న్యాయవాదులు పేర్కొన్నారు. పోలీసులు మెమోను దాఖలు చేసి కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.– బీఆర్ఎస్, లీగల్ సెల్ ప్రతినిధి, జక్కుల లక్ష్మణ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు క్రిశాంక్‌పై నమోదైన కేసులు