హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ రోడ్లపై నిలబడితే.. సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు స్టార్ హోటళ్లలో మీటింగ్‌లు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్చార్జిగా ఉన్నా ఉమ్మడి కరీంనగర్ రైతుల కష్టాలను తీర్చడంలో జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కొప్పుల ఈశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూరియా కోసం నెలరోజులుగా రైతులు అల్లాడుతుంటే.. మంత్రులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.