విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఈ ప థకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఆయ న హెచ్చరించారు.
- ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం
- మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఈ ప థకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఆయ న హెచ్చరించారు. రాష్ట్రంలోని 12.75 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతున్నదని ఫైర్ అయ్యారు. శనివారం విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ తదితర బీసీ వి ద్యార్థి సంఘం నేతలతో కలిసి ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఫీజుల భారం పూర్తి గా విద్యార్థులపై మోపడం అన్యాయమని వా పోయారు. ఈ నెల 30న హైకోర్టులో విచారణ జరుగనుండగా, ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆ వేదన వ్యక్తంచేశారు. పథకాన్ని ఎత్తివేసే కుట్రలను మానుకోవాలని హితవు పలికారు. ప్ర భుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. నందగోపాల్, నరసింహనాయక్, ఉదయ్‌నేత, సాయి, రఘు, వరుణ్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

