హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8న రెండోవార్షికోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రెండో వార్షికోత్సవం సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్-2047’ పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు-తెలంగాణపై ప్రత్యేక దృష్టి’ అనే అంశంపై శనివారం బేగంపేటలోని సెస్ సెమినార్‌హాల్‌లో సదస్సు జరుగనున్నది. తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ (టీఈఏ), సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతున్నది. టీఈఏ అధ్యక్షుడు డాక్టర్ కే ముత్యంరెడ్డి అధ్యక్షత నిర్వహించే సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీన్ దేబశిష్ ఆచార్య ప్రసంగిస్తారని సెస్ డైరెక్టర్ రేవతి, టీఈఏ సెక్రటరీ వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.