హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే భారీగా రుణాలను సమీకరిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.6,900 కోట్లు అప్పు తీసుకున్న రేవంత్రెడ్డి సర్కార్.. ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో మరో రూ.4,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. ఏప్రిల్లో మొదటి 21 రోజుల్లోనే రెండు ప్రధాన విడతల్లో బాండ్ల వేలం ద్వారా రూ.6,900 కోట్ల రుణాన్ని ఓపెన్ మారెట్ సేకరణ కింద తీసుకున్నది. తాజాగా సెక్యూరిటీ బాండ్లు పెట్టి 17 ఏండ్ల కాలపరిమితికి 7.86 శాతం వార్షిక వడ్డీతో రూ.2,000 కోట్లు, 30 ఏండ్ల్ల కాలపరిమితికి 7.88 శాతం వార్షిక వడ్డీతో రూ.2,000 కోట్లు ఈ వేలం ద్వారా సేకరించింది.
తొలి త్రైమాసిక లక్ష్యం రూ.18,900కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేస్తామని ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ ఇప్పటికే ఇండెంట్ సమర్పించింది. ఇందులో ఏప్రిల్లో రూ.6,900 కోట్లు, ఇప్పుడు నాలుగువేల కోట్లు తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచే ఓపెన్ మార్కెట్ రుణాలుగా రూ.85,840 కోట్లు అప్పు తీసుకున్నది. బడ్జెట్ అంచనాల్లో మాత్రం రుణ సమీకరణ రూ.54.009 కోట్ల వరకు ప్రతిపాదించింది. కానీ, రూ.85,840 కోట్లు.. అంటే 158.93 శాతం అప్పు తీసుకున్నది. 2026-27లో రూ.80,000 కోట్ల రుణ సమీకరిస్తామని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు.
2026-27లో ఆర్బీఐ నుంచి రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్పు
రుణ తేదీ మొత్తం