హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వేట కొనసాగుతూనే ఉన్నది. రెండో త్రైమాసికం (క్యూ2) తొలిరోజే రూ.7వేల కోట్ల భారీ రు ణాన్ని సమీకరించిన సర్కార్.. ఆర్బీఐ ప్రతి మంగళవారం ఓపెన్ మారెట్ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్టి అప్పులు తీసుకుంటూనే ఉన్నది. గత మంగళవారం రూ.3వేల కోట్లు సేకరించిన ప్రభుత్వం ఈ మంగళవారం మరో రూ.2,500కోట్ల రుణం సమీకరించిం ది. 11 ఏండ్ల కాలపరిమితితో 7.70 శాతం వార్షిక వడ్డీకి రూ.1,000కోట్లు, 29ఏండ్ల కాలపరిమితితో 7.75 శాతం వార్షిక వడ్డీకి మ రో రూ.1,500 కోట్లు తీసుకున్నది.
ఈ మూడు వారాల్లో చేసిన అప్పు రూ.12,500 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుం చి తీసుకున్న అప్పులే రూ.31,400 కోట్లకు చేరాయి. తొలి త్రైమాసికంలో రూ.18,900 కోట్ల రుణ సమీకరణ పూర్తిచేసింది. జూలై-సెప్టెంబర్(క్యూ2)లో రూ.21,000 కోట్లు అప్పు కా వాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. గత బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణను రూ.54,009 కోట్ల లోపే ప్రతిపాదించినా.. ఒక ఆర్బీఐ నుంచే రూ.85,840 కోట్లు అప్పుగా తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80వేల కోట్ల రుణ సమీకరణ చేస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.

Debit