నర్సంపేట, సెప్టెంబర్ 4 : యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బహిరంగ లేఖలు రాశారు.
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు యూరియా కొరతతో అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటూ ఆనాటి కాంగ్రెస్ పాలనను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టే రేవంత్‌రెడ్డి.. రైతులకు యూరియా బస్తాలు ఇవ్వలేక పోతున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో 50వేల మంది రైతులు రోజూ యూరియా కోసం రోడ్డెక్కుతున్నారని తెలిపారు.