మోటర్లపైనా కాంగ్రెస్ కుట్ర!
కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటర్లపైనా కుట్రలకు పాల్పడుతున్నదని, కాళేశ్వరం, దేవాదుల ప్రా జెక్టులను ఇష్టారీతిన నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తున్నదని ధ్వజమెత్తారు.
- పంప్‌హౌస్‌ల నిర్వహణ గాలికి
- పెద్ద మోటర్ల నిర్వహణ అశాస్త్రీయం
- మరమ్మతులకు వస్తే బీఆర్ఎస్పై నెపం మోపేందుకు సర్కార్ కుయుక్తి
- మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
- ఇరిగేషన్‌శాఖ మంత్రికి లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటర్లపైనా కుట్రలకు పాల్పడుతున్నదని, కాళేశ్వరం, దేవాదుల ప్రా జెక్టులను ఇష్టారీతిన నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటర్లను నిబంధనలకు విరుద్ధంగా అశాస్త్రీయంగా నిర్వహిస్తున్నదని మండిపడ్డారు. ‘పంపులు, మో టర్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతున్నదా? ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా?’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేరకు రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. పంప్‌హౌస్‌ల పనితీరుపై తీవ్ర ఆందోళన వ్య క్తం చేశారు.
కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోని అధిక సా మర్థ్యమున్న మోటర్లను పదేపదే ఆన్, ఆఫ్ చేస్తూ రన్ చేస్తున్న విష యం తెలు సా? అని మంత్రిని నిలదీశారు. అది ప్రాథమికంగా ఇంజినీరింగ్ డిజై న్ సూత్రాలకు విరుద్ధమని, తద్వారా పంపు లు, ఇంపెల్లర్లు, షియర్ పిన్లు, షాఫ్ట్‌లు, వా టికి సంబంధించిన ఎలక్ట్రో-మెకానికల్ సిస్టమ్‌లను క్రమంగా తీవ్రంగా దెబ్బతీస్తుందనే దానిపై అవగాహన ఉన్నదా? అని ప్రశ్నించా రు. పంపుల ఇన్స్టాలేషన్, కమిషనింగ్ సమయంలోనే నిరంతరాయం పనిచేసేలా సిస్టమ్‌లను ఏర్పాటు చేశారని, స్టార్ట్-స్టాప్ సైకిల్స్ కోసం కాదని సాంకేతిక నిపుణులు స్పష్టంగా తెలియజేశారని లేఖలో వివరించారు.
అ లాంటి సిస్టమ్‌లో ప్రతి స్టార్టప్ తీవ్రమైన కంపనాలు, హైడ్రాలిక్ ట్రాన్సియెంట్స్, వాటర్ హామర్ ఎఫెక్ట్స్‌కు దారితీస్తాయని, ఆ పరిస్థితు ల్లో పదేపదే స్టార్ట్-స్టాప్ ఆపరేషన్లు చేయడం వల్ల ఇంపెల్లర్లు, షాఫ్ట్‌లు, బేరింగ్లు, షియర్ మెకానిజమ్‌పై అసాధారణ ఒత్తిడి పడుతుందని, ఆ పద్ధతి సాంకేతికంగా అత్యంత ప్రమాదకరమైందని వెల్లడించారు. ప్రస్తుతం ఇవేవీ పట్టించుకోకుండా పంపులను పదేపదే నడుపడం వల్ల మరమ్మతులకు గురయ్యే ప్రమా దం ఉన్నదని, కీలక మౌలిక వసతులు దీర్ఘకాలికంగా స్తంభిస్తాయని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. నిపుణులకు అవగాహన ఉన్నా, సాంకేతికంగా లోపభూయిష్టమైనదని తెలిసీ అనుమతిస్తున్నారా? లేక పరిపాలనా నిర్లక్ష్యం ఫలితమా? అని మంత్రి ఉత్తమ్‌ను ప్రశ్నించారు.
లేదంటే నష్టాన్ని కలిగించి, తదనంతరం గత ప్రభుత్వాన్ని నిందించడానికి ఇలాంటి పద్ధతులు కొనసాగిస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణ రైతుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. పంపులను తరచుగా ఆన్, ఆఫ్ చేయడం విరమించుకోవాలని, ఉత్తమ ఇంజినీరింగ్ పద్ధతులను కచ్చితంగా పాటిస్తూ ఆపరేషన్స్ కొనసాగించాలని కోరారు. తెలంగాణ నీటిపారుదల మౌలిక సదుపాయాలు లక్షలాది మంది రైతులకు జీవనాధారమని, అవగాహనలోపం వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ పొరపాట్లు జరిగితే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపైనా, వ్యవసాయ స్థిరత్వంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కీలకమైన పంప్‌హౌస్‌ల నిర్వహణపై దృష్టిసారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

