హైదరాబాద్: విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారన్నారు. ఏడాది గడుస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదని విమర్శిచారు.
తాత్కాలికంగా ఇరుకు గదిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని, అందులో స్థలం సరిపోక ఉద్యోగార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారి చెప్పారు. ప్రభుత్వం వెంటనే నూతన గ్రంథాలయ భవన పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు.
విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను విస్మరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. ఏడాది గడుస్తున్న నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు.… pic.twitter.com/0j1jmuXRzX
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 19, 2025