హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తేతెలంగాణ): హక్కుల సాధన కోసం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్లపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని బీరాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి అంగన్వాడీలపై పోలీసులను ప్రయోగించడం సిగ్గుచేటని గురువారం ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం బాధాకరమని పేర్కొన్నారు.‘ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు.