హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) నిబంధనలను సవరిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ (ఎంఏయూడీ) జీవో 98 జారీ చేసింది.
ఇప్పటివరకు కేవలం సేల్డీడ్ ద్వారా జరిగే లావాదేవీలను మాత్రమే ఎల్ఆర్ఎస్లో పరిగణనలోకి తీసుకునేవారు. ఇకపై గిఫ్ట్, ఎక్సేంజ్, వారసత్వ డీడ్ల ద్వారా జరిగే లావాదేవీలను కూడా పరిశీలనలోకి తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఈ తరహా అప్లికేషన్ల సంఖ్య 4 వేలకు మించి ఉండదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.