Musi River | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మూసీ సుందరీకరణకు లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపడుతున్న రేవంత్ ప్రభుత్వం.. అదే మూసీకి చేటుగా మారిన ఈ రాడార్ స్టేషన్కు సుముఖంగా ఉండటంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో గంగానది విషయంలో ఒక న్యాయాన్ని, మూసీ విషయంలో మరో న్యాయా న్ని పాటించడమేంటని నిలదీస్తున్నారు.
గంగానది విషయంలో ఏమైంది?
హిందువులు పరమ పవిత్రంగా కొలిచే గంగానది గంగోత్రి హిమానీనదంలోని గోముఖ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అటవీ భూముల్లో విస్తరించిన ఈ ప్రాంతంలో నిర్మాణాలు, పర్యాటక, వాణిజ్య కార్యక్రమాలు చేపడితే అది గంగానది అస్థిత్వానికే ప్రమాదమని కేంద్రప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో గంగానది, దాని పరీవాహంలో నివసిస్తున్న జీవజాలం పరిరక్షణకు 2012లో గంగోత్రి ఎకో-సెన్సిటివ్ జోన్ (ఈఎస్జడ్) పేరిట ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గంగానది జన్మస్థలానికి సుమారు 150 కిలోమీటర్ల మేర పరిధిని పర్యావరణానికి అత్యంత సున్నితమైన ప్రాంతంగా ప్రకటించింది. పర్యాటకం పేరిట హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటును, అభివృద్ధి పేరిట మైనింగ్, పరిశ్రమల ఏర్పాటును నిషేధించింది.
కఠినమైన శిక్షలు, జరిమానాలు
గంగానది జన్మస్థానంలో వృక్ష, పక్షి, క్షీరద జాతులకు హాని కలిగే చర్యలు చేపట్టేవారికి, నదీజలాల కలుషితానికి కారణమయ్యేవారికి కఠినమైన శిక్షలను అమలుచేయాలని, భారీ జరిమానాలు విధించాలని కేంద్రం తేల్చిచెప్పింది. చైనా సరిహద్దుల వరకు ఈ నియమాలు ఉన్నట్టు గెజిట్ నోటిఫికేషన్ను బట్టి అర్థమవుతున్నది. చార్ధామ్ ప్రాజెక్టు పేరిట గంగోత్రిలో రోడ్ల విస్తరణను చేపట్టాలనుకొన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) చర్యలను సుప్రీంకోర్టు గతంలో తప్పుబట్టడం గమనార్హం. గంగానది విషయంలో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రే మ చూపగా.. ఇప్పుడు మూసీనది విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం సర్వత్రా విమర్శలకు కారణమవుతున్నది.
ఈఎస్జడ్లో నిబంధనలు అతిక్రమిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం శిక్షలు ఇలా