లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కలేరు
ఉద్యోగాల నోటిఫికేషన్లు అడిగిన నిరుద్యోగుల గొంతుకను లాఠీలతో నొకాలని చూ డటం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనం : సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల నోటిఫికేషన్లు అడిగిన నిరుద్యోగుల గొంతుకను లాఠీలతో నొకాలని చూ డటం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యు వతపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయించడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.
దిల్సుఖ్నగర్లో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తూ, అక్రమం గా అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారం, ని రంకుశత్వానికి నిదర్శమని మండిపడ్డారు. ఎ న్నికలకు ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, మెగా నోటిఫికేషన్లు ఇస్తామని ఊకదంపుడు ఉ పన్యాసాలు ఇచ్చి, గద్దెనెకిన తర్వాత నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నదని విమర్శించా రు. నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

