Ambedkar | అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ మహనీయుడి జయంతి రోజునే ఘటన
Dr. BR Ambedkar | బహుముఖ ప్రజ్ఞశాలి డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఘోరంగా అవమానించింది (Insulted).
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఘోరంగా అవమానించింది (Insulted). ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాహెడ్ అంబేద్కర్ జయంతిని సబ్బండ వర్ణాలు ఘనంగా జరుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
తెలంగాణ సచివాలయం పక్కన ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి కనీసం పూలతో అలంకరణ చేయకుండా.. ఆ దర్శనికుడిని పట్ల ప్రభుత్వం తన నిర్లక్ష్య ధోరణిని చాటిచెప్పింది. అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారపూరిత వైఖరిపై పలువురు మండిపడుతున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు 125 విగ్రహాన్ని నిర్మించి ఎలా గౌరవించిందో గుర్తు చేసుకుంటున్నారు.పొద్దున లేస్తే ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం, అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పాలన చేస్తామని ఊదరగొట్టే ప్రభుత్వం చేతల్లో మాత్రం తన వివక్షను చూపించిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశాభివృద్ధికి ఎంతో కృషి చేసిన అలాంటి గొప్ప వ్యక్తికి కనీస గౌరవం కల్పించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

