హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తం గా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. పరిపాలన మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం చేతి లో ఉన్నది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభు త్వం ఇవేవీ పట్టించుకోలేదు. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగానే బుధవారం ఉదయం పలువురు ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అంతేకాదు, పరిపాలనాపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది. జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒకవైపు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఓటింగ్ జరుగుతుండగా, మరోవైపు అధికారుల బదిలీలు, జీహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వం యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమ ల్లో ఉన్నప్పుడు, అధికారులను బదిలీ చేయాలనుకుంటే, ముందుగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించాలి.
వాటిని పరిశీలించి ఎన్నికల సంఘం బది లీ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ, ఇక్కడ ప్రభుత్వమే ఆ పని చేయడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వమే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోడ్ ఉండ గా అధికారుల బదిలీలు, జీహెచ్ఎంసీ విభజన చేయడం ఉల్లంఘన కాదా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు లేవు కాబ ట్టి, ఇక్కడ కోడ్ ఉండదని, విభజన ఉత్తర్వులు ఇచ్చినా తప్పులేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ విభజనను ప క్కనపెడితే మొత్తం రాష్ర్టానికి సంబంధించి న పలు శాఖల అధికారులను సైతం బదిలీ చేశారు కదా.. ఇది ఉల్లంఘన కిందికి రాదా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం అధికారుల వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులోకి రాలేదు.