అంబేద్కర్ ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు!
అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది.
- చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌కు తిలోదకాలు
- అట్టడుగువర్గాలపై నిత్యం అరాచకాలు
- నేడు బీఆర్ అంబేద్కర్ జయంతి
హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది. నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. అదీగాక అట్టడుగు వర్గాలపై అడుగడుగునా అరాచకాలకు పాల్పడుతున్నది. నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
డిక్లరేషన్ హామీలకు తిలోదకాలు..
- జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లను 18శాతానికి పెంచుతామని చెప్పి, ఇప్పుడు జనగణనతో ముడిపెట్టి తప్పించుకున్నది.
- ఎస్సీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అమలుచేస్తామని చెప్పి, చట్టం చేసినా కూడా ఇప్పటికీ అమల్లోకి తీసుకురాలేదు. స్థానిక సంస్థలకు వర్తింపజేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
- ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రగల్భాలు పలికింది. కానీ, ఆచరణలో అమలుచేయలేదు.
- ఇండ్లులేని ఎస్సీ, ఎస్టీలకు ఇంటిస్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలు అందిస్తామని ప్రకటించింది. అదీ నెరవేరలేదు.
- ఎస్సీల్లో మాల, మాదిగ, ఇతర ఉపకులాలకు కొత్తగా 3 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్లు మంజూరు చేస్తామని చెప్పింది. కానీ, కేవలం మాల, మాదిగ కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నది.
- విద్యాజ్యోతి (మహాత్మా ఫూలే ) పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాసైతే రూ.10వేలు, ఇంటర్ పాసైతే రూ.15వేలు, డిగ్రీ పూర్తిచేస్తే రూ.25వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని చెప్పింది. కానీ, అమలు చేయలేదు.
ఉన్న పథకాలకూ మంగళం..
పైన పేర్కొన్న పథకాలే కాకుండా.. అసైన్డ్ భూముల పునరుద్ధరణ, పోడుపట్టాల పంపిణీ, సమ్మక్క-సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం, కొత్త ఐటీడీఏలు, సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలు, మొత్తంగా దళిత డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి పథకానిదీ అదే పరిస్థితి. కాంగ్రెస్ హామీలన్నీ నీటిమూటలేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న పథకాలకూ ప్రస్తుత రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా మంగళం పలుకుతున్నది. దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో విద్యనందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు బకాయిలు విడుదల చేయడం లేదు. రాజీవ్ యువవికాసం పేరిట ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్‌ను నిర్వీర్యం చేస్తున్నది. సబ్‌ప్లాన్ నిధులు సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు.
అడుగడుగునా అరాచకాలు..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అట్టడుగువర్గాలపై దాడులు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల ఉదంతమే అందుకు నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అసైన్ల్యాండ్ను ప్రభుత్వం కబ్జా పెడుతున్నది. ప్రభుత్వ పెద్దలే నిబంధనలకు విరుద్ధంగా దళిత, గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ అనధికార ఒప్పందాలకు తెరతీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

