Kishan Reddy | ఆరు గ్యారెంటీలు అమలుచేయాలనే చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులెందుకు?: కిషన్రెడ్డి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దరఖాస్తుల విషయంలో పూర్తిగా రాజకీయమే కనిపిస్తున్నదని విమర్శించారు.
- అయోమయంగా ‘అభయహస్తం’
- 14 నుంచి స్వచ్ఛత అభియాన్
- అయోధ్య ప్రాణప్రతిష్ఠ లైవ్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
Kishan Reddy | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దరఖాస్తుల విషయంలో పూర్తిగా రాజకీయమే కనిపిస్తున్నదని విమర్శించారు. కాలయాపన చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రేషన్కార్డులు, ఉద్యమకారులు జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని గుర్తు చేశారు.
దరఖాస్తుల పేరుతో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తామన్న రూ.2500 దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఇస్తారా? లేదంటే అందరికీ ఇస్తారా?అన్న విషయంలో స్పష్ట త లేదని విమర్శించారు. 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని అన్ని ఆలయాల్లోనూ లైవ్లో వీక్షించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 14 నుంచి 22వ తేదీ వరకు దేశంలోని పుణ్యస్థలాలు, దేవాలయాల ప్రాంగణాల్లో స్వచ్ఛత అభియాన్ నిర్వహించనున్నట్టు చెప్పారు. 22న ఇంటింటా ముగ్గులు, పచ్చతోరణాలతో అలంకరించడంతో పాటు 5 శ్రీరామజ్యోతులను వెలిగించాలని కిషన్రెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

