మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 31 : మహబూబ్‌నగర్ శివారులో నెలరోజులుగా చిరుత సంచరిస్తున్నా బంధించండంలో అధికారులు విఫలమయ్యారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
గురువారం పట్టణంలోని టీడీ గుట్ట వద్ద ప్రజలు చిరుతను పరిశీలిస్తుండగా.. అదే సమయంలో చిన్నదర్పల్లిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన టీడీ గుట్ట వద్ద ఆగి చిరుత కదలికలను పరిశీలించారు.
రాష్ట్రంలో చిరుతపులుల సంచారం పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన అటవీశాఖ అధికారి(పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ తెలిపారు.