హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ): పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రా ష్ట్రంలో బీజేపీ కొత్త శక్తిగా నిలువబోతున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందం గా ముందుకొచ్చి ఓటేశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఏపీలో ఎన్నికలు, ఇతర కారణాలతో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఒక్కరోజుముందు వేలాది ఓట్లను తొలిగించారని ఆరోపించారు.