హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను వంచిస్తూ, కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు చరమగీతం పాడేవరకు పోరాటం చేద్దామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పి లుపునిచ్చారు. త్వరలో లక్షలాది మంది నిరుద్యోగుల కోసం ప్రియాంకాగాంధీ పాల్గొన్న మైదానంలోనే భారీ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వా న్ని వారి తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని యు వతకు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ చైతన్యపురిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగుల వంచన సభ’లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు వచ్చి రెండు లక్షల ఉ ద్యోగాలిస్తామని యువతను మోసం చేసిన ఘ నత ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీకే చెల్లుతుందని, ఇక ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్న అబద్ధాల కోరు అని ఎద్దేవా చేశారు. యువతకు రూ.4వేల నిరుద్యోగ భృతి, యువతులకు స్కూటీలు ఇస్తామని నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేండ్లలో సెక్రటేరియేట్, గురుకులాలు, ఇంజినీరింగ్ కాలేజీలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే రెండున్నరేండ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఏ ఒక్క పనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పో రాటం చేసిన ఘనత విద్యార్థులదేనని తలసా ని గుర్తుచేశారు. ఉద్యమస్ఫూర్తి కేసీఆర్‌ది అయితే దానిని నడిపించింది విద్యార్థులేనని కొనియాడారు. కేసీఆర్ 100కు 90శాతం ఉద్యోగాలు తమ పిల్లలకే కావాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారని గుర్తుచేశారు. 2023 ఎన్నికల సమయంలో ప్రవళిక అనే యువతి చనిపోతే రాహుల్, రేవంత్, ప్రియాంక పోస్ట ర్లు పెట్టి హడావుడి చేశారని.. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నిరుద్యోగులు చనిపోతే పట్టించుకోలేదని ఓ నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగులను నిలువునా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడుతామని నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రానాయక్ హె చ్చరించారు. నిరుద్యోగుల కడుపుకోత, ఆవేదన, ఆక్రందన ప్రభుత్వ పెద్దలకు తెలియడం లేదని విమర్శించారు. నిరుద్యోగ జేఏసీ నేత ఆకాశ్ మాట్లాడుతూ ఈ నిరుద్యోగుల సభను బీఆర్ఎస్ సభ అని కాంగ్రెస్ నాయకులు మా ట్లాడితే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉరికించి కొడుతామ ని స్పష్టంచేశారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ తెస్తే కాంగ్రెస్ హయాంలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు తరలిపోతున్నాయని శంకర్ ఆరోపించారు. ఉద్యమాల గడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ప్రత్యూష ఆ వేదన వ్యక్తంచేశారు. జీవో నెంబర్ 108ని రద్దు చేయాలని భూక్యా కుమార్ డిమాండ్ చే శారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వేర్వేరుగా టెట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేదాకా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుని 60వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని ఆశపడితే కేవలం 270 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఉసూరుమనిపించారు.
– ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే నిరుద్యోగ యువత రోడ్డున పడుతున్నారు. జీవో ల పేరుతో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అయి నిరుద్యోగ అభ్యర్థులను హైకోర్టు లో ఓడించారు. ప్రైవేట్ కంపెనీల్లో 90శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కానీ, ఆ ప్రైవేట్ కంపెనీలు కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నాయి. దిల్సుఖ్నగర్ కాస్త దిల్ దుఖః నగరం, అశోక్‌నగర్ శోక నగరంగా మారింది. నిరుద్యోగులకు అండగా ఉంటాం.
– బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి
అబద్ధాలు చెప్తూ మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై నిరుద్యోగుల తరఫున పోరాడు తాం. ప్రైవేట్ రంగంలో 75శాతం రిజర్వేష న్లు కల్పిస్తామని సీఎం రేవంత్ ముఖం చాటేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి 100 ఉంటే దాన్ని తీసేస్తామని చెప్పి రూ.1,000కి పెంచారు. జీవో నెంబర్ 46ను తొలగించేందుకు 100మందితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఇప్పుడు మరో ముల్కీ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
– అశోక్, అశోక్ అకాడమీ చైర్మన్