హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గౌతమ్ అదానీ ఆ ర్థిక అవకతవకలతో దేశ ప్రతిష్ఠ దిగజారినా ప్రధాని మోదీ స్పందించడం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం విమర్శ లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రె స్ ఢిల్లీ పెద్దలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులోభాగంగానే టీపీసీసీ కూడా బుధవారం చలో రాజ్‌భవన్ కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార, ఏఐసీసీ ఇన్చార్జి దీ పాదాస్ మున్షీ, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
పీడీఎస్ బియ్యం ఎటుపోతున్నాయ్ మండలి చైర్మన్ గుత్తా
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3.7లక్షలుగా గ ణాంకాలు చెప్తుంటే.. రాష్ట్రంలో పేదరికం ఎక్కడ ఉన్నదని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త రేషన్‌కార్డుల పై చర్చ జరిగింది. చైర్మన్ గుత్తా స్పం దిస్తూ.. ప్రభుత్వం సరఫరా చేసే బి య్యం పేదలకు దుతున్నాయా? లేక కాకినాడ పోర్టుకు వెళ్తున్నాయా?’ అ ని అనుమానం వ్యక్తంచేశారు.