ఖైరతాబాద్, డిసెంబర్ 16 : తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ కలిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలన్న డిమాండ్‌కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, అదే క్రమంలో ఓటుకు నోటు కేసులో ఏ-1గా ఉన్న రేవంత్, ఏ-2గా ఉన్న చంద్రబాబును తనకు తెలంగాణ టీడీపీని ఇచ్చేయాలని బ్లాక్‌మెయిల్‌కు దిగాడని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో చేసేదేం లేక చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకొని ఏపీ కి వెళ్లిపోయాడని, నాటి నుంచి తెలంగాణ పై కక్షపెంచుకొని పగతీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నాడని తెలిపారు. శిష్యుడు రేవంత్ తెలంగాణ సీఎం కావడంతో మరోసారి తన పగసాధించే పనిలో పడ్డాడని ఆరోపించారు.
చంద్రబాబు దశలవారీగా కుట్రలు ప్రా రంభించాడని, మొదటి దశలో హైదరాబా ద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల సమస్యల పేరుతో 2024 నవంబర్ 27 నుంచి డి సెంబర్ 28 వర కు అప్పటి సీపీ సీవీ ఆనంద్‌తో 144 సెక్షన్ అమ లు చేయించారని జడ్సన్ తెలిపారు. రెండో దశలో కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కోతలు ప్రారంభమయ్యాయని, రాజ్యాంగంలో కమిటెడ్ బడ్జె ట్ అనేది ఉన్నదని, దాని ఆధారంగా ప్రభు త్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్లు, పీఆర్సీ, డీఏలు ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ సహా 95% రాష్ర్టాలు ప్రభుత్వ ఉద్యోగులకు 55% పీఆర్సీ, డీఏ లు ఇచ్చాయని, కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. జీతాలు, పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఆర్థి క ఎమర్జెన్సీ ప్రకటించే పనిలో సీఎం ఉన్నాడని ఆరోపించారు. తెలంగాణకు రాబడి, ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.30 వేల కోట్లు మిగులుతాయని, కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని ప్రచారం చేస్తూ దోచుకుంటున్నారని, ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ దొంగలేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం తన సొంతింటి మరమ్మతులకు రూ.3 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకుంటున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం తన కొడుకు ఎంగేజ్‌మెంట్‌ను సైతం ప్రజాభవన్‌లోనే ప్రభుత్వ ఖర్చుతో జరిపించాడని చెప్పారు. రాష్ట్రం లో లేని కరువును చూపిస్తూ ప్రజల దృష్టి మళ్లించేందుకు దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంశాన్ని ముందుకు తెచ్చారని ఆరోపించారు.