సూర్యాపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన కుక్కలు చింపిన వి స్తరిలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని నడపడం చేతకావడంలేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా మాజీ సీఎం కేసీఆర్ మీద ఏడుపు తగ్గడంలేదని మండిపడ్డారు. కేసీఆర్ చేపట్టిన సర్వే కరెక్ట్ అని, రేవంత్ సర్వే బోగస్ అని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని తెలిపా రు. సూర్యాపేటలో గురువారం జగదీశ్‌రెడ్డి మీడియా తో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై విచారణ జరిపించాలన్న కాం గ్రెస్ నాయకుడు షబ్బీర్‌అలీ వ్యాఖ్యలపై మండిపడ్డా రు. సీబీఐతో కాదు సీఐఏతో కూడా చేసుకోవచ్చని తేల్చిచెప్పారు. విచారణ జరిగితే 16 లక్షల మంది జనాభాను లెక్కలోకి తీసుకోనందుకు రేవంత్‌రెడ్డి జైలుకు పోవాల్సి వస్తుందని తెలిపారు. సర్వేలో జనాభాను తగ్గించడం వల్ల ఎంపీ సీట్లు, కేంద్రం ఇచ్చే నిధుల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు. నాడు కేసీఆర్ సర్వే అంటే దేశవిదేశాల నుంచి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారని, కాంగ్రెస్ సర్వే అంటే తరిమికొట్టారని కాంగ్రెస్ పెద్దలే సెలవిచ్చారని గుర్తుచేశారు.
కేసీఆర్‌ను తిడితేనే పూట గడుస్తుందని కాంగ్రెస్ నేతల నమ్మకం. రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం కేసీఆర్ మీద ఏడుస్తరు. కేసీఆర్‌ను మాయం చేసిన అని రేవంత్ అంటండు. రోజూ తిరుపతి వెంకన్నను తలిచినట్టు, రాములవారిని తల్చినట్టు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తలిచినట్టు రోజుకోసారి తలుస్తడు. ఒకడు కేసు పెట్టాలంటడు, ఒకడు అడికి, ఈడికి రావాలంట డు, ఏడికి ఏప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసు. ఎప్పు డు రావాలని ప్రజలు కోరుకుంటున్నరో కూడా కేసీఆర్‌కు తెలుసు. రేవంత్, కాంగ్రెస్ నాయకులు చిల్లర వేషాలు మానుకోవాలి. కేసీఆర్‌ను తిడుతున్న సీఎం, మంత్రులు, నాయకులపై జనం కోపానికొస్తున్నరు. కేసీఆర్ మీదపడి ఏడుస్తరు.. మీకు బుద్ధి ఉందా? అని మండిపడుతున్నరు. అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.