జగిత్యాల, జూలై 20 : కాంగ్రెస్ సర్కార్ యాసంగి, వానకాలంలో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి.. రుణమాఫీకి మళ్లించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రుణమాఫీలోనూ కోతపె ట్టి రైతులను మోసం చేసిందని, పం ట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెడుతున్నదని విమర్శించారు. శనివారం ఆయన జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్ సర్కారు రుణమాఫీ చేసినట్టు పత్రికా ప్రకటనలకే కోట్లు ఖర్చు చే సిందని విమర్శించారు. యాసంగి, వానకాలంలో రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఈ సొమ్ము రూ.20 వేల కోట్లకుపైనే ఉం టుందని, దానిన ఎగ్గొట్టి కొంత రుణమాఫీకి మళ్లించిందని చెప్పారు.
షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలి
మఠంపల్లి, జూలై 20 : కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు షరతుల్లేకుం డా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పెదవీడులో శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం లో రెండు దఫాలుగా రూ.31వేల కో ట్ల రుణమాఫీ జరిగితే, కాంగ్రెస్ ప్ర భుత్వం 6వేల కోట్లే మాఫీచేసి సం బురాలు చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. జీఓ నెం.46 ప్రకారం ఉద్యోగం పొందిన కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రతి సీమ్‌లో ఓ సామ్
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి స్కీమ్‌లో ఏదో ఒక స్కామ్ ఉన్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలన అని విమర్శించారు. రుణమాఫీ పేరు తో ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు.