మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 15:28:25

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు, కార్య‌క‌ర్త‌లు

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు, కార్య‌క‌ర్త‌లు

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేట‌ర్లు, కార్య‌క‌ర్త‌లు నేడు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా 0పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పోచయ్య, మంజుల, మహేష్, బిజేపి కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి శ్రీధర్ గౌడ్ టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. అదేవిధంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అనిత యాదగిరి, వారి అనుచరులు దాదాపు 300 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి మంత్రి మ‌ల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జహంగీర్, మేయర్ బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి పాల్గొన్నారు.





logo