Singareni | యైటింక్లయిన్కాలనీ, డిసెంబర్ 19 : తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి సంస్థను మూసివేసేందుకు కాంగ్రెస్ కుట్ర లు పన్నుతున్నదని టీబీజీకెఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గతంలో సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సం క్షేమం, వైద్యం కోసం నిధులను వినియోగిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవసరాల కోసం సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీలోని ప్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణి వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు రూ. 41 లక్షలు కేటాయించారని, అందులో ఆర్జీ-2 ఏరియాకు రూ.2.82 లక్షలు ఇచ్చారని గుర్తుచేశారు.
ఈ సారి కేవలం రూ.55వేలే కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మనుమడికోసం పుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని రాష్ర్టానికి తీసుకొచ్చి ఆడించడానికి సింగరేణి యాజమాన్యం రూ.10 కోట్ల నిధులను కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్ర పథకాల ప్రచారం కోసం సింగరేణి నిధులను దుబారా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా యాజమా న్యం సంస్థ ఆవిర్భావ వేడుకలను ఘనం గా నిర్వహించాలని డిమాండ్ చేశారు.