హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదని అంటూ ఈ నెల 27న నమస్తే తెలంగాణలో ఓ వార్త ప్రచురితమైందని తెలిపింది. ఆ వార్త పూర్తిగా అసత్యమని, నిరాధారమైనదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు నమస్తే తెలంగాణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.