స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్నికల కోడ్ సమయంలో తెలంగాణలో రైతుబంధు నిధులు విడుదల చేయవద్దని వాదిస్తున్న కాంగ్రెస్‌కు.. కేంద్రంలోని బీజేపీ సర్కారు చర్యలు కనిపించట్లేదు.
ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే ‘పీఎం-కిసాన్’ నిధులను విడుదల చేస్తున్నట్టు నవంబర్ 15న స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. దీనిపై అటు ఈసీ చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేయలేదు.
కాళేశ్వరంలో ఓ పిల్లర్ కుంగిందంటూ అక్టోబర్
22న కేంద్రానికి రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ లేఖ
రెండ్రోజుల్లో హైదరాబాద్‌కు కేంద్రబృందం రాక
హడావుడిగా 5 రోజుల్లో నివేదిక సమర్పణ
రైతుబంధు నిలిపేయాలంటూ ఈసీకి అక్టోబర్ 25న కాంగ్రెస్ లేఖ
స్కీమ్‌కు బ్రేక్ వేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటన
యాసంగి సీజన్ ఎత్తిపోయే అవకాశం ఉన్నందున రైతులకు పెట్టుబడి సాయం
విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీకి బీఆర్ఎస్ సర్కారు పలుమార్లు విజ్ఞప్తి
బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 24న రైతుబంధుకు ఈసీ గ్రీన్‌సిగ్నల్
ఎన్నికల ప్రచారంలో ‘రైతుబంధు’ను ప్రస్తావిస్తున్నారంటూ 26న ఈసీకి కాంగ్రెస్ నేతలు నిరంజన్, రేవంత్ లేఖ
రైతుబంధు నిధుల పంపిణీని 27న నిలిపేసిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్ లేఖలు రాయడం, వెంటనే బీజేపీ చర్యలు తీసుకోవడం.. ఇదీ కాంగ్రెస్-బీజేపీ మధ్యనున్న ‘ఫెవికాల్ బంధం’