జనగామ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పూర్తి రాజకీయ లక్ష్యాలతో కాంగ్రెస్ కుట్ర పూరితంగా ఘోష్ కమిటీ నివేదిక తయారైందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు, రైతాంగం నమ్మదని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కాలికి శస్త్ర చికిత్స కారణంగా విశ్రాంతిలో ఉన్న ఆయన మంగళవారం మొయినాబాద్‌లోని తన నివాసం నుం చే ప్రజెంటేషన్‌ను వీక్షించారు.
పల్లా మాట్లాడుతూ.. రైతాంగానికి వరప్రదాయిని అయి న కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.