BRS Party | ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి
BRS Party | ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
- పలువురికి తీవ్రగాయాలు
- ఖమ్మం జిల్లా పండితాపురంలో ఉద్రిక్తత
BRS Party | కారేపల్లి (కామేపల్లి) ఏప్రిల్ 9: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్నది. జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కొమ్మినేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరి కుటుంబం, పలువురు కార్యకర్తల ఇండ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పండితాపురంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎడ్లబండిపై ప్రభల ఊరేగింపు జరుగుతున్నది. ఆ సమయంలో బీఆర్ఎస్ కొమ్మినేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరి తన కుమారుడు జానీతోపాటు సోదరుడి కుమార్తె బ్యూలాను బైక్‌పై ఎక్కించుకొని ఇంటికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఓ మంత్రి అనుచరుడిగా చెప్పుకునే మేకపోతుల మహేశ్‌గౌడ్ సహా మరికొంతమంది కలిసి చల్లా హరిపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకున్న పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కామేపల్లి మండల అధ్యక్షుడు దనియాకుల హన్మంతరావు.. తన కారులో కొమ్మినేపల్లిలోని చల్లా హరి ఇంటికి వెళ్లగా.. కాంగ్రెస్ గూండాలు హన్మంతరావు కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లపైనా దాడి చేసి పలువురిని గాయపర్చారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టు ఏసీపీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

