చెన్నూర్ రూరల్/రామకృష్ణాపూర్/ఆసిఫాబాద్ టౌన్/నడిగూడెం/భీమ్‌గల్, జనవరి 26 : బీఆర్ఎస్లోకి కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. సోమవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భా రీగా బీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలోని మైనార్టీ నాయకుడు సయ్యద్ దిల్షాద్ అలీ తన అనుచరులతో కలిసి జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్, తదితర పార్టీలకు చెందిన సుమారు 200 మంది నాయకులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. కాగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7, 10, 20వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజలు భారీగా బీఆర్ఎస్లో చేరారు. వీరందరికి బాల్క సుమన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు గూడ సత్తయ్య, ఆకిరెడ్డి రవీందర్, 20వ వార్డులో మంద వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది భారీ ర్యాలీగా వచ్చి బీఆర్ఎస్లో చేరారు.

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వేముల భాస్కర్‌తోపాటు ఆయన అనుచరులు వందమంది మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన నాగరాజు ఆధ్వర్యంలో దాదాపు వందమంది కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వల్లపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యా దవ్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.